ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కుబేర' విడుదల అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 05:44 PM



శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. హిందువుల సంపద దేవత పేరు పెట్టబడిన కుబేర చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలని పెంచుతుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాని ఫిబ్రవరి 2025లో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం పాత్ర పరిచయాలు మరియు గ్లింప్సె సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న కుబేర సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్లి మిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com