ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో '35-చిన్న కథ కాదు' టీమ్ యాత్ర డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 02:40 PM



నూతన దర్శకుడు నంద కిషోర్ ఈమని దర్శకత్వంలో నటి నివేతా థామస్ నటించిన చిత్రం '35-చిన్న కథ కాదు' సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని కడపలో ప్రేక్షకులతో కలిసి రవి థియేటర్ లో ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి షోని వీక్షించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ కంటెంట్-రిచ్ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ మరియు గౌతమి కీలక పాత్రలలో నటిస్తున్నారు. అకడమిక్ ఒత్తిడి యొక్క సార్వత్రిక పోరాటాన్ని మరియు తిరుగులేని తల్లిదండ్రుల మద్దతు యొక్క ప్రభావాన్ని ఈ క్లీన్ ఫ్యామిలీ డ్రామా అన్వేషిస్తుంది. ఈ చిత్రంలో భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్ మరియు అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సృజన్ యరబోలు మరియు సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాని ప్రముఖ రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com