కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలో AGENT సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమా రూపొందింది.. నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా, స్వరూప్ RSJ దర్శకత్వంలో, స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నక్కా రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
హీరో నెల్లూరులో డిటెక్టివ్, హీరోయిన్ అతని అసిస్టెంట్.. కేసుల్లేక అల్లాడుతున్న డిటెక్టివ్‌కు దొరక్క దొరక్క ఓ కేసు దొరికితే, దాని చుట్టూ బోలెడన్ని లిటికేషన్స్ ఉంటాయి.. వాటన్నిటినీ అధిగమించి ఆ కేసు ఎలా సాల్వ్ చేసాడు.. డిటెక్టివ్‌గా స్థిర పడ్డాడా, లేదా అనే పాయింట్‌తో, కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన AGENT సాయి శ్రీనివాస ఆత్రేయ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది.. సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.. సంగీతం : మార్క్ కె రాబిన్, కెమెరా : సన్నీ కూరపాటి, ఎడిటింగ్ : అమిత్ త్రిపాఠి, ఆర్ట్ : క్రాంతి ప్రియమ్...