ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ సినిమాలో జబర్దస్త్ యాంకర్ ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 08, 2019, 10:43 AM



ఒక వైపున బుల్లితెరపై .. మరో వైపున వెండితెరపై అనసూయ ఒక రేంజ్ లో సందడి చేసేస్తోంది. ప్రస్తుతం 'కథనం' చిత్రంలో ఆమె ప్రధాన పాత్రధారిగా చేస్తోంది. ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే ఆమె మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం. 

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. చిరూ సరసన కథానాయికగా శ్రుతి హాసన్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వుందట. ఈ పాత్రను అనసూయతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల ఆమెను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఇందుకోసం అనసూయకి భారీ మొత్తంలోనే పారితోషికం ముడుతోందని చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com