గత ఇరవై రోజులుగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌కు తీరిక లేదు. వరుస చిత్రీకరణలతో ఆమె ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి పరుగులు పెడుతోంది. వల్లకాదు అనకుండా శ్రమిస్తూ చెమటోడుస్తోంది. హైదరాబాద్‌లో సాహో కోసం చిత్రీకరణ చేసిన శ్రద్ధా ఆ తర్వాత దుబాయ్ వెళ్లి స్ట్రీట్ డాన్సర్ త్రీడీ షూటింగ్లో పాల్గొంది. దుబాయ్ నుంచి ఇస్తాంబుల్ చేరుకుని అక్కడ మరో సినిమా చిత్రీకరణ చేసింది. ఇలా గంటల వ్యవధిలో ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్ వెళ్తూ మూడు వారాలుగా పనిచేస్తోంది. ఇంత కష్టపడటాన్ని శ్రమగా భావించకుండా ఇష్టంగా తీసుకుంటున్నట్లు చెప్పింది. శ్రద్ధా మాట్లాడుతూ…ఇదొక వింత సమయం. నిద్రించడానికి కొంత సమయం, మిగతా పనులకు మరికొంత విరామం దొరికితే చాలు ఎంత శ్రమించడానికైనా సిద్ధమే. వరుస చిత్రీకరణలను కష్టంగా భావించడం లేదు. కానీ కొన్నిసార్లు చెమటోడ్చా ల్సివస్తోంది. ప్రస్తుతం విభిన్నమైన పాత్రల్లో నటించే అవకా శాలు వస్తున్నాయి. నేను కోరుకున్నదీ ఇదే. నాయికగా అన్ని రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిం చాలి. అప్పుడే నా నట ప్రతిభ తెలు స్తుంది. నటిగా నాకూ సంతృప్తి దక్కుతుంది. నట జీవితం లో అనేక పాత్రల్లో జీవించే అవకాశం దొరికినట్లే. అని చెప్పింది.