ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ‌జంట‌` సెన్సార్ పూర్తి.. జూన్ 28న గ్రాండ్ రిలీజ్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 08, 2019, 02:17 PM



సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ప్రేమ‌జంట‌. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుద‌ల చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.


ఈ సంద‌ర్భంగా ... నిర్మాత మ‌హేష్ మొగుళ్ళూరి మాట్లాడుతూ - తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం. రామ్ ప్రణీత్, సుమయ జోడి క్యూట్‌గా ఉంటుంది. ద‌ర్శ‌కుడు నిఖిలేష్ తొగ‌రి సినిమాను బ్యూటీఫుల్‌గా తెర‌కెక్కించారు. సినిమాలో 5 పాట‌లుంటాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చాయి. కవర్ సాంగ్స్, మరియు tiktok వీడియోలతో సినిమా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ అయ్యింది. సెన్సార్ పూర్తయ్యింది. `యు/ఎ` స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. జూన్ 28న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నాం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com