బిగ్ బాస్ షోను తెలుగులోకి తీసుకువస్తే అసలు క్లిక్ అవుతుందా అనే సందేహం అప్పట్లో ఉండేదేమో కాని, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 మొదలెట్టకపోతే మాత్రం మాటివి ఆఫీస్ మీద తెలుగు ప్రజలు మూకుమ్మడి దాడి చేస్తారేమో అనేంత క్రేజ్ సంపాదించింది సదరు ప్రోగ్రామ్. ముఖ్యంలో సీజన్ 2లో కౌశిక్ అండ్ గీతా మాధురి రచ్చ చూశాక, ఈ రియాల్టీ సిరీస్ కోసం చాలామంది టివి ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనే నటీనటులను భలే బ్యాలెన్సడ్ గా సెలక్ట్ చేస్తుంటారు. అటు విజయవాడ నుండి ఎవరినైనా ఒకరిని తీసుకుంటే, ఇటు తెలంగాణ నుండి కూడా ఒకర్ని తీసుకుంటారు. మొదటి సీజన్లో కత్తి కార్తికను అలాగే సింగర్ మధుప్రియను తీసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి కావల్సినంత తెలంగాణం తెచ్చేశారు. ఇక రెండవ సీజన్లో కూడా ఇనస్టాగ్రామ్ స్టార్ దీప్తి సునాయన అలాగే డ్యాన్సర్ భానుశ్రీను దించారు. ఆ విధంగా ఆంధ్ర అండ్ తెలంగాణను బ్యాలెన్స్ చేస్తుంటారు. మరి సీజన్ 3లో ఎవరు పాల్గోనున్నారో తెలుసా?
తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, అలాగే తెలుగు సినిమాల్లో కూడా బొంభాట్ గుందిరో పోరీ అంటూ అలరిస్తున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను బిగ్ బాస్ టీమ్ కలిసినట్లు తెలుస్తోంది. మనోడు ఇంకా ఓకె చెప్పలేదు కాని, ఇతన ఓకె చెబితే అప్పుడు తెలంగాణ నుండి సెలక్ట్ చేయాల్సిన రెండో క్యాండిడేట్ గురించి ఒక డెసిషన్ తీసుకుంటారట. ఆ రెండో క్యాండెట్ కూడా, అయితే బిత్రి సత్తి, లేదంటే ఒక ప్రముఖ తెలంగాణ న్యూస్ రీడర్ అని తెలుస్తోంది. అది సంగతి.