ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్ళీ ఒకసారి డబ్బింగ్ చెబుతున్న ప్రభాస్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 08, 2019, 04:10 PM



ప్రభాస్ కథానాయకుడిగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో 'సాహో' నిర్మితమవుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మరో వైపున ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైపోయాయి. హిందీ వెర్షన్ లోను ప్రభాస్ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట.

తెలుగు ... తమిళ భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ప్రభాస్ ప్రత్యేకంగా హిందీ భాషపై దృష్టిపెట్టేసి నేర్చుకుని మరీ డబ్బింగ్ చెబుతున్నాడట. 'బాహుబలి' హిందీ వెర్షన్ రిలీజ్ సమయంలో భాష విషయంలో కాస్త ఇబ్బంది పడిన ప్రభాస్, ఆ తరువాత నుంచే హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టేసి పట్టు సంపాదించాడని అంటున్నారు. 'సాహో' హిందీ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఈ సారి ప్రభాస్ దడదడలాడించేయడం ఖాయమన్నమాట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com