స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను మహానటి దర్శకుడు నాగి మరియు నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా...మధుర శ్రీధర్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ టైటిల్. `మళ్ళీరావా`లాంటి మంచి చిత్రాన్ని నిర్మించి, అభిరుచి గల నిర్మాత అని పేరు తెచ్చుకున్న రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమా నిర్మాత అంటే సినిమా ఏంటో అర్థం అవుతుంది. నవీన్ మంచి యాక్టర్. అతను నటిస్తున్న ఈ డిఫరెంట్ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ నాగి మాట్లాడుతూ నవీన్ నాకు `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` చిత్రం నుంచి పరిచయం. తనలో మంచి నటుడు ఉన్నాడు. యూనిక్‌గా ప్రమోట్ చేస్తే సినిమాపై ఆటో మేటిక్‌గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలాంటి ప్రమోషన్స్‌తోనే వస్తున్నారు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` టీమ్. ట్రైలర్లో కామెడీ, థ్రిల్లర్ కనిపిస్తున్నాయి. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నారని మాత్రం అర్ధం అవుతుంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలుతున్నా అన్నారు.
చిత్ర దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ ఏజెంట్ అనే పదం పక్కన ఇంగ్లీష్ పేర్లతో ఉన్న టైటిల్స్ చాలా కనిపిస్తాయి మనకు. అందుకే ఏజెంట్ పక్కన స్వచ్ఛమైన తెలుగు పేరు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` అనే టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టాం. మొదట్లో నిర్మాత రాహుల్‌గారు కన్విన్స్ అవలేదు. టైటిల్ డిజైన్ చేశాక కన్విన్స్ అయ్యారు. టైటిల్ లాగానే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆత్రేయ మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్ చేస్తాడు. సినిమా చూశాక మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారు అన్నారు.