తాజాగా మరోసారి కాల్విన్ క్లెయిన్ టీ షర్ట్.. అండర్ వేర్ ధరించి ఓ మోడరన్ ఖజురహో శిల్పం లాంటి పోజిచ్చింది బాలీవుడ్ నటి దిశాపటాని. తెల్లటి బెడ్ పై మోకాళ్ళపై వయ్యారంగా కూర్చుంది. దిశా కూర్చున్న పోజును జస్ట్ చూస్తేనే నెటిజనులకు 10000 వోల్టుల షాక్ తగిలేలా ఉంది. బ్లాక్ డ్రెస్ కావడంతో చాకొలేట్ కలర్ శరీర వర్ణం మరింతగా మెరిసిపోతూ ఉంది. ఫేషియల్ మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉండడంతో ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది. జస్ట్ నాలుగు గంటల్లోనే 1.4 మిలియన్లకు పైగా లైకులు కొట్టి ఇన్నర్ వేర్ భామకు తమ జేజేలు తెలిపారు నెటిజన్లు. ఫర్హాన్ అఖ్తర్ సాబ్ గర్ల్ ఫ్రెండ్ షిబాని దండేకర్ కూడా ఫిదా అయ్యి రెండు ఫైర్ ఎమోజిలు పెట్టింది. ఇక సాధారణ నెటిజనులు “హాటెస్ట్ గర్ల్ ఇన్ ది వరల్డ్”.. “స్టన్నింగ్ & గార్జియస్”.. “బ్లాక్ ఇన్నర్ వేర్ ఈజ్ బ్యూటిఫుల్” అంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఈ ఎక్స్ పోజింగ్ చూసి ఒకరికి కోపం వచ్చి “నువ్వు జన్మలో బాగుపడవు” అని అన్నాడు.