ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యయ్యో! హీరోయిన్ తాప్సి కి ఏమైంది ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2019, 12:08 PM



ప్రముఖ హీరోయిన్ తాప్సి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్ట, రెండు కాళ్లకూ పిండి కట్టు కట్టుకున్నట్టుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ చేయ్యంతా ఎర్రగా కందిపోయి ఉంది. ప్రస్తుతం తాను నటించిన 'గేమ్‌ ఓవర్‌' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆమె, అందులో భాగంగానే ఈ ఫోటోలను విడుదల చేసిందా? లేక నిజంగానే ప్రమాదం జరిగి గాయపడిందా? అన్న విషయమై స్పష్ట లేదు. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా "మంచు కొండల్లో షిఫాన్‌ చీరలు కట్టుకుని ఇరవై ఐదు రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను" అని తాప్సీ పేర్కొంది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు అసలేం జరిగిందో చెప్పాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com