ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే ప్రేమ పుట్టింది…

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 12:27 PM



సినిమాలపై ప్రేమ, నాయిక కావాలనే ఆసక్తి చిన్నప్పుడే పుట్టిందని చెప్పుకుంటోంది అందాల తార ప్రియాంకా జవాల్కర్‌. తెరపై చిత్రాలను ఆస్వాదించే వయసు నుంచే..తానూ అలా నటించాలని కోరుకుందట. తొలి సినిమా టాక్సీవాలాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియాంకా…మరికొన్ని ఆసక్తికర చిత్రాల్లో కనిపించబోతోంది. పేరున్న కథానాయకులతోనే ఆమె సినిమాల సంప్రదింపులు జరుగుతున్నాయి. నాయిక కావాలనే కోరిక మనసులో ఉంటే మరో వృత్తి ఎందుకు సంతృప్తినిస్తుంది. ప్రియాంకా మాటల్లో వింటే…అనంతపురంలో బాల్యం గడిచింది. ఉద్యోగం హైదరాబాద్‌లో చేశాను. విరామంలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చదివాను. ఈ కోర్సులో మెరుపగడేందుకు అమెరికా వెళ్లాను. అక్కడ నేర్చుకున్నవీ సంతప్తినివ్వలేదు. మిత్రుల ద్వారా అవకాశం వస్తే కొన్ని లఘు చిత్రాల్లో నటించాను. అవి నాకు బాగా పేరు తీసుకొచ్చాయి. వీధుల్లో నడుస్తుంటే జనం గుర్తుపట్టడం మొదలుపెట్టారు. అప్పుడే నిర్ణయించుకున్నాను సినిమాల్లోకి రావాలని. నటనలో శిక్షణ తీసుకుని నిర్మాణ సంస్థల కార్యాలయాలకు ఫొటోలు పంపాను. నాయిక కావాలనుకునే నా కల త్వరలోనే తీరింది. అని చెప్పుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com