ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా 'విరాటపర్వం' పై తాజా వార్త

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 04:08 PM



రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం' రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో వెంకటేశ్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది.దగ్గుబాటి సురేశ్ .. చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి కనిపించనుంది. ఈ ప్రాజెక్టుపై చాలాకాలం క్రితమే కసరత్తు మొదలైంది. అయితే ఒక వైపున రానా .. మరో వైపున సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన ఆలస్యమైంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com