ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ అభిమానులకు శుభవార్త ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 05:00 PM



చిరంజీవి 151వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.


ఆ రోజున 'సైరా' నుంచి ఏదైనా సర్ ప్రైజ్ ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఆ రోజున ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం. 'సైరా'పై అమాంతంగా అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ ఉండాలనే ఉద్దేశంతో సురేందర్ రెడ్డి - చరణ్ ఉన్నారట. మెగాస్టార్ పుట్టినరోజు అభిమానులందరికి పండుగరోజేనన్న మాట. ఈ సినిమాలో నాయికగా నయనతార నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రలో తమన్నా కనిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com