ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో సందీప్ కిషన్ కు గాయాలు!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 08:35 PM



టాలీవుడ్ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ ఒకరు..జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరొకరు..ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవుతున్నారు. వైజాగ్‌లో జరుగుతున్న షూటింగ్‌లో హీరో ‘నాగ శౌర్య’ గాయపడిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. హీరో సందీప్ కిషన్‌ కూడా గాయమైంది. కర్నూలులో ‘తెనాలి రామకృష్ణ’ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. ఫైట్ మాస్టర్ పొరపాటుతో బాంబ బ్లాస్ట్‌లో సందీప్‌కు గాయమైంది. వెంటనే ఇతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వరుస ప్రమాదాలపై టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. యాక్షన్ సీన్లతో టాలీవుడ్ స్టార్లు కేక పుట్టిస్తున్నారు. ఈ సీన్స్ తీసే సమయంలో గాయాల పాలవుతున్నారు. కొన్ని రోజులుగా హీరోలు గాయాల బాట పడుతున్నారు. RRR షూటింగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గాయాలయ్యాయి. చాణక్య మూవీ షూటింగ్‌లో గోపిచంద్ గాయపడ్డాడు. వైజాగ్ షూటింగ్‌లో నాగ శైర్యకు గాయాలు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com