సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో . సాయి రోణక్, ప్రీతీ అస్రాణి, రాహుల్ రామకృష్ణ తదితరులు తారాగణంగా రూపొందుతున్న ప్రజర్ కుక్కుర్ చిత్రం ఫస్ట్ లుక్ను శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దగ్గుబాటు సురేశ్ పాల్గొని ఆవిష్కరించారు. పోస్టర్లో సూట్ కేసులతో వెళ్తున్న హీరోను ఇద్దరు యువకులు అడ్డుకోగా, హీరోయిన్ ఎదురుగా తమాషా చూస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతఅన్నపరెడ్డి అప్పిరెడ్డి, మాట్లాడుతూ కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగం, చదువు, ప్రేమ, పెళ్లి, సంసారం, మరెన్నో విషయాల్లో జనం ప్రెజర్ కుకర్లో వేసిన కూరగాయలు, మాంసాల్లా ఉడికిపోతున్న సామాన్యులు కొందరు తమ ఒతప్పిడిని సరదా తీసుకుని బతుకుబండిని నడిపించుకుపోయేవాళ్లు ఉన్నారు. ఇలాంటి ఒత్తిడిని ఇతివృత్తంగా తీసుకుని వినోదభరిత చిత్రంగా ప్రెజర్ కుక్కర్ని రూపొందిస్తున్నట్టు నిర్మాతతెలిపారు.