బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పాల్గొని రెండు వారాలకే బయటకు వచ్చేశాడు ఆర్జే శేఖర్ బాషా. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా వివిధ కారణాలతో అతను వార్తల్లో నిలుస్తున్నాడు.వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిగ్ బాస్ హౌస్, కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు బయటకు చెబుతున్నాడు. అయితే తాజాగా ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ అయ్యినట్లు ప్రచారం సాగింది. ప్రముఖ యూబ్యూబర్ హర్ష సాయిపై నమోదైన అత్యాచారం కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శేకర్ బాషాను అదుపులోకి తీసుకున్నట్లు వచ్చాయి. శుక్రవారం (అక్టోబర్ 18) రాత్రి బాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంటల పాటు వినిపించారని రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ పుకార్లపై స్వయంగా శేకర్ బాషానే స్పందించాడు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశాడీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. 'నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు. ప్రో కబడ్డీ లీగ్ చూసేందుకు గచ్చి బౌలి మైదానానికి వెళ్లాను. అందుకే నా ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. అందుకే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాను. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్లే. ఎవరూ నమ్మవద్దు' అని క్లారిటీగా చెప్పుకొచ్చాడు బాషా.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ హర్షసాయి అత్యాచారం కేసులో శేకర్ బాషా తలదూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా హర్ష సాయి కి మద్దతుగా మాట్లాడిన అతను బాధితురాలిపై సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వచ్చాయి. దీంతో పోలీసులు శేఖర్ ను అదుపులోకి తీసుకున్నట్లు న్యూస్ వచ్చింది. అయితే ఇందులో నిజం లేదని అతను కొట్టిపారేశాడు. మరి ఈ పుకార్లు ఎందుకొచ్చాయనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.