ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 11:37 AM



టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 22, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇటీవలే చిత్ర బృందం "ట్రైలర్ 1.0" పేరుతో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్  విశ్వక్ సేన్‌ను కొత్త అవతార్‌లో ప్రదర్శిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com