ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి వేట్టయన్ ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:43 PM



సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. జై భీమ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు.దసరా కానుకగా ఈనెల 10న విడుదలైన వేట్టయన్ సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు దక్కించుకుంది. రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల కలెక్షన్లు రాబట్టింని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంచనాలకు మించి భారీ వసూళ్లు రావడంతో తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా గట్టిగా నిర్వహించింది వేట్టయన్ బృందం. అందరికీ బిర్యానీలు వడ్డించారు. ఇదిలా ఉంటే వేట్టయన్ మూవీ ఓటీటీ విడుదలపై సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ అతి త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. వేట్టయన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందుకోసం వేట్టయన్ మేకర్స్ కూ భారీగానే ముట్టజెప్పినట్లు టాక్. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల కు ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన నవంబర్ 7 న లేదా 9న వేట్టయన్ ఓటీటీలోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన వేట్టయన్ లో రజనీతో పాటు మంజు వారియర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి ముఖ్యపాత్రల్లో నటించారు.


ఈ కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.కాగా తాజాగా వేట్టయన్ మూవీ యూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్‌ పేరుతో చెన్నైలో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరైన ప్రతి ఒక్కరికీ బిర్యానీతో సహా విందు భోజనాలు వడ్డించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com