ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్.. అదిరిపోయిన ప్రోమో

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 02:24 PM



 అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రోమోను మంగళవారం (అక్టోబర్ 22) ఆహా వీడియో తన ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది.ఏపీ సీఎం, తన బావ చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ జరిపిన ఫన్నీ సంభాషణతో ఈ ప్రోమో చాలా సరదాగా సాగిపోయింది. ఈ సందర్భంగా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాబు నోట బాలయ్య డైలాగ్ వినిపించింది.


అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రోమో
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ వచ్చే శుక్రవారం (అక్టోబర్ 25) గ్రాండ్ గా మొదలు కాబోతోంది. గతంలోలాగే ఈసారి కూడా తొలి ఎపిసోడ్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును గెస్టుగా తీసుకొచ్చారు. ఈ బావ, బావ మరదుల మధ్య సరదా సంభాషణతో ప్రోమోనే రచ్చ రచ్చ చేసింది.


ఇక అసలు ఎపిసోడ్ ఎలా ఉండనుందో అన్న ఆతృతను అభిమానుల్లో పెంచేసింది. ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. "రెండు ఆపలేని శక్తులు.. ఒక అద్భుతమైన షో.. విజయసాధనలో పడ్డ ఇబ్బందులు, జనసేనానితో తనకున్న ఆప్యాయతలు, ఇలా ఎన్నో అంశాలు, అనుభూతులు, బాలచంద్రుల ముచ్చట్లతో మీ ముందుకు" అనే క్యాప్షన్ తో ప్రోమోను రిలీజ్ చేసింది.


అదిరిపోయిన ప్రోమో
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. బాలయ్య వేరు.. అభిమానులు వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటే.. పండగ మళ్లీ మొదలైంది అనే బాలకృష్ణ డైలాగుతో ఈ ప్రోమో ప్రారంభమైంది. తర్వాత మా బావగారు, మీ బాబుగారు అంటూ చంద్రబాబును బాలయ్య ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక అక్కడి నుంచి ఈ ఇద్దరి రచ్చ మొదలైంది.


బాబు రాగానే అన్‌స్టాపబుల్ బుక్ పై ఆయనతో ప్రతిజ్ఞ చేయించాడు బాలకృష్ణ. ఏది అడిగితే దానికి సమయస్ఫూర్తిగా సమాధానం చెబుతానని ప్రమాణం చేస్తున్నానంటూ చంద్రబాబు చెప్పారు. ప్రోమో మొదట బాబు జైలుకెళ్లడం, 53 రోజుల పాటు అక్కడ గడపడం.. దీని చుట్టూ ప్రశ్నలు సాగాయి. ఆ తర్వాత మెల్లగా పవన్ కల్యాణ్ తో జైల్లో సమావేశం ఎలా మలుపు తిప్పిందన్నదానిపైకి చర్చ మళ్లింది.


ఈ సీరియస్ అంశాలు ముగిసిన తర్వాత బావ, బావ మరదులు మధ్య సరదా సంభాషణ మొదలైంది. ఆకాశంలో సూర్యచంద్రుల్లాగే ఆంధ్రాలో బాబు గారు, కల్యాణ్ బాబు అంటున్నారంటూ బాలయ్య తనదైన స్టైల్లో చెప్పాడు. బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ జోక్స్ ఉంటాయంటూ బాబు అన్నారు.
మా చెల్లితో మీరు చూసిన రొమాంటిక్ మూవీ ఒక్కటి చెప్పండని బాలయ్య అడిగితే.. నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఎలా అంటూ బాబు చమత్కరించారు. ఇక తనకు ఎప్పుడూ విరాట్ కోహ్లి అంటేనే ఇష్టమని ధోనీ, కోహ్లిలలో ఒకరిని ఎంచుకోమని అడిగినప్పుడు చంద్రబాబు తెలిపారు.
ఇంట్లో తన చెల్లి భువనేశ్వరి, కూతురు బ్రాహ్మణిలలో ఎవరు బాస్ అని బాలయ్య అడిగిన ప్రశ్నకు కూడా బాబు సరదాగా స్పందించారు. ఇలా ఐదు నిమిషాల పాటు సాగిన ప్రోమో తొలి ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. శుక్రవారం (అక్టోబర్ 25) రాత్రి 8.30 గంటలకు ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే తొలి ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com