ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త కార్ కొనుగోలు చేసిన రామ్‌ చరణ్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 11:15 PM



గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌  కొత్త కార్ కొనుగోలు చేసారు. ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో కారు టీఎస్‌09 2727 రోల్స్‌ రాయిస్‌ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు. జేటీసీ రమేశ్‌.. చరణ్‌ కారు రిజిస్ట్రేషన్కు అవసరమైన సేవలు అందించారు. రామ్‌చరణ్‌ రవాణాశాఖ కార్యాలయానికి వస్తున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ భారీ సంఖ్యలో తరలివచ్చి తన అభిమాన నటుడితో ఫొటో దిగారు.


ఇందుకు సంబంధించిన విజువల్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘గేమ్‌ ఛేంజర్‌’  చిత్రంలో నటిస్తున్నారు. అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇటీవల దిల్‌ రాజు వెల్లడించారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌ నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com