ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 11:25 PM



సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'వేట్టయన్‌- ద హంటర్‌'  తమిళంతోపాటు తెలుగులో కూడా చక్కని విజయాన్ని అందుకుంది. 'జై భీమ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు టీజే జ్ఞాన్‌ వేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రజనీతోపాటు అమితాబ్‌ బచ్చన్‌, దగ్గుబాటి రానా, మంజు వారియర్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రితికా సింగ్‌, రోహిణి, అభిరామి, దుషారా విజయన్‌ లాంటి స్టార్స్‌ కీలక పాత్రల్లో నటించారు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ రజనీకాంత్‌ స్టామినాను  మరోసారి నిరూపించింది. ఇప్పటివరకు వేట్టయన్‌ సినిమాకు 129 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. దీంతో చిత్ర బృందం ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.


ఈ నేపథ్యంలో వేట్టయన్‌ సినిమా యూనిట్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ మీట్‌ పేరుతో చెన్నైలో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతోపాటు పలువురు ప్రముఖులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ విందు భోజనాలు వడ్డించారు. డైరెక్టర్‌ టీజే జ్ఞానవేల్‌ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వండించారు. హీరోయిన్‌ రితికా సింగ్‌ కూడా అతిథులకు స్వయంగా బిర్యానీ వడ్డించి సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా రజనీకాంత్‌ ఈ సక్సెస్‌ మీట్‌కు రాలేకపోయారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com