ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రిలో 'క' ప్రమోషన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 04:37 PM



టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే పీరియాడికల్ థ్రిల్లర్ 'క' అనే చిత్రాన్ని ప్రకటించారు. ఆసక్తికరమైన టైటిల్ మరియు టీజర్ ప్రాజెక్ట్ చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో నటి సత్యభామ అనే పాత్రలో కనిపించనుంది. యువ దర్శకులు సుజీత్ మరియు సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించబడింది. ఈ సినిమాలోని సాంగ్ స్ కి భారీ స్పందన లభించింది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈరోజు రాత్రి 7 గంటలకి రాజమండ్రిలోని షెల్టన్ హోటల్ లో ప్రెస్ మీట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసింది. ఎడిటర్ శ్రీ వరప్రసాద్, సినిమాటోగ్రాఫర్లు విశ్వాస్ డేనియల్ మరియు సతీష్ రెడ్డితో సహా సాంకేతిక బృందంతో “క” థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సినిమా తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపతి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో తన్వి రామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించగా, శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com