ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2024, 07:33 PM



కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ ని అక్టోబర్ 26న చెన్నై లోని నెహ్రు ఇన్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం యొక్క బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మాగ్నమ్ ఓపస్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని భాషలలో 3D ఫార్మటు లో విడుదల కానుంది. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com