అత్యాచార కేసు వేసిన మహిళ అరెస్ట్ !

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 18, 2019, 07:04 PM

ప్రముఖ టీవీ నటుడు, సింగర్ కరణ్ ఒబెరాయ్‌పై అత్యాచార కేసును వేసిన మహిళను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒబెరాయ్‌పై ఆమె తప్పుడు కేసును బనాయించిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా తనను 2017లో ఒబెరాయ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని.. దాన్ని వీడియో తీసి తనను బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మే6న పోలీసులు కరణ్ ఒబెరాయ్‌ను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే అతడిపై మరోసారి మే 25న పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె.. కరణ్ ఒబెరాయ్‌పై తాను వేసిన కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామంటూ కొందరు తనను బెదిరించారని కంప్లైంట్ ఇచ్చింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించారని.. కేసు వెనక్కి తీసుకోకపోతే తనపై యాసిడ్ దాడి చేస్తామని అన్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. దీనిని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు నిజం తెలిసింది. బైక్‌పై వచ్చిన వారిలో ఒకరు ఆమె తరఫున వాదిస్తోన్న న్యాయవాది బంధువులని తేలింది. ఇదంతా ఆమే పథకం ప్రకారం చేయించిందని.. ఇలా చేసేందుకు వారు ఆమె వద్ద నుంచి 10వేలు తీసుకున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్‌పై ఆమె పెట్టిన కేసు తప్పని నిర్ధారణకు వచ్చి ఆ మహిళను అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో వరుణ్‌కు జూన్7న ముంబయి హైకోర్టు నుంచి బెయిల్ లభించింది. ఆ తరువాత మెన్‌టూ మూమెంట్ పేరుతో రెండు రోజుల క్రితం ఆయన ముంబయిలో ధర్నా చేసిన విషయం తెలిసిందే.
Recent Post