ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే 'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 02:54 PM



నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌తో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మూడవసారి కలిసి "సారంగపాణి జాతకం" అనే టైటిల్ తో తమ తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రూప కొడుయూర్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ వికె, తనికెళ్ల భరణి మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని సారాంగో సారంగా అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 5:36 గంటలకి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. వివేక్ సాగర్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రంజోగ్గయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ తన గాత్రాన్ని అందించారు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రం ఒక అద్భుతమైన హాస్యం మరియు అద్భుతమైన తారాగణం కలగలిసి ఉంటుంది అని సమాచారం. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, పిజి విందా ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com