ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యతో అల్లు శిరీష్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 06:15 PM



కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని భాషలలో 3D ఫార్మటు లో విడుదల కానుంది. ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం "కంగువ" విడుదలకు ఒక నెల మాత్రమే సమయం ఉండటంతో నిర్మాతలు ప్రొమోషన్స్ ని చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా  ప్రొమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ తో స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com