ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 08:58 PM



వయసులో తనకంటే పెద్ద వారైన హీరోలతో యాక్ట్‌ చేయడంపై నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) స్పందించారు. అందులో తప్పేం లేదని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాల విషయంలో తాను వయసును పెద్దగా పట్టించుకోనన్నారు.‘‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’తో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. సన్నీదేవోల్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నా. వయసు పరంగా మా మధ్య 38 ఏళ్ల వ్యత్యాసం. బాలీవుడ్‌లో ఇదొక రికార్డు. నాకు తెలిసినంత వరకూ అంత ఏజ్‌ గ్యాప్‌తో ఎవరూ స్క్రీన్ షేర్‌ చేసుకోలేదు. సన్నీదేవోల్‌ పిల్లలకంటే నేను చిన్నదాన్ని. దర్శకుడు ఆ విధంగా స్క్రిప్ట్‌ రాసినప్పుడు.. ఆలోచించినప్పుడు యాక్ట్‌ చేయడంలో తప్పు లేదు. సినిమాల్లో నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే అది నా వృత్తి. నిజ జీవితంలో నేనేమీ నా కంటే పెద్ద వ్యక్తితో డేట్‌లో లేను కదా! అలా ఉన్నప్పుడు బాధపడాలి’’ అని ఊర్వశీ రౌతేలా చెప్పుకొచ్చారు.‘వాల్తేరు వీరయ్య’తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి ఊర్వశీ రౌతేలా. అందులో ఆమె చిరంజీవితో ఆడిపాడారు. అనంతరం ‘ఏజెంట్‌’, ‘బ్రో’, ‘స్కంద’ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ కోసం వర్క్ చేశారు. ప్రస్తుతం NBK 109 కోసం వర్క్‌ చేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇందులో ఊర్వశీ కీలకపాత్రలో కనిపించనున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com