ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డీమోంటే కాలనీ 2'

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 02:54 PM



సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2 సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్‌కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ హారర్ థ్రిల్లర్ తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27, 2024 నుండి జీ5లో తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ సినిమాలు ఛానల్ లో అక్టోబర్ 31న మధ్యాహ్నం 3 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ పిల్టఫార్మ్ సోషల్ మెడిలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బి. సురేష్ రెడ్డి మరియు బి. మానస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఆంటి జస్కెలైన్, త్సెరింగ్ డోర్జీ మరియు అరుణ్ పాండియన్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com