ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SDT 18' ఆన్ బోర్డులో నవీన్ విజయకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 04:40 PM



టాలీవుడ్ నటుడు సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SDT18' అని పిలువబడుతుంది. తేజ్ కొత్త లుక్‌తో ఈ సినిమా కోసం పూర్తి రూపాంతరం చెందాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం హనుమాన్ విజయవంతమైన తరువాత అధిక బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ చిత్రంలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి జోడిగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ఎడిటర్ గా నవీన్ విజయకృష్ణ ఆన్ బోర్డులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రంలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు 13 భారీ సెట్‌లను నిర్మించారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com