ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గేమ్ ఛేంజర్' నార్త్ ఇండియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 03:44 PM



శంకర్ షణ్ముగం దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యాక్షన్ డ్రామా చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీలో జనవరి 10, 2025న విడుదల కానుంది. ఈ సినిమా యొక్క టీజర్ ని దివాళి సందర్భంగా విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా రైట్స్ ని AA ఫిలిమ్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com