ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జై హనుమాన్ ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 04:30 PM



ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ‘హను-మాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఆయన తన సినిమాటిక్ యూనివర్స్ నుండి మరిన్ని సూపర్ హీరో మూవీస్ చేయనున్నట్లు గతంలోనే వెల్లడించారు. ఇక ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ మూవీ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు.దీంతో ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే దీపావళి కానుకగా ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. అన్నట్లుగానే ‘జై హనుమాన్’ మూవీ నుండి ఓ సాలిడ్ అప్డేట్‌ను ఆయన సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్టోబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ తాజాగా అనౌన్స్ చేశాడు.


ఇక ఈ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా అందరి చూపు ‘జై హనుమాన్’ మూవీపై పడింది. ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీలో మెయిన్ లీడ్‌లో ఎవరు నటిస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ‘హను-మాన్’ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. మరి ఆ సినిమాలో హనుమాన్ పాత్రను రివీల్ చేయని ప్రశాంత్ వర్మ, ‘జై హనుమాన్’ సినిమాలో ఈ పాత్రలో ఎవరిని చూపిస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com