ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రాబిన్‌హుడ్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 07:22 PM



టాలీవుడ్ నటుడు నితిన్ తదుపరి అడ్వెంచరస్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబిన్‌హుడ్‌లో కనిపించనున్నాడు. గతంలో నితిన్‌తో భీష్మ చిత్రానికి పనిచేసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రెండు సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్న పిక్స్ ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రఖ్యాత ప్రొడక్షన్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా టీజర్ మరియు పాటలకు సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలో విడుదల కానున్నాయి. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెనర్ మరియు మాజీ SRH ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ప్రత్యేకంగా కనిపించనున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com