ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యారవాన్ ఖరీదు అక్షరాలా 7 కోట్ల రూపాయలట!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2019, 08:15 PM



అల్లు అర్జున్ తెరపైనే కాదు..బయట కూడా తనదైన ప్రత్యేకతను కనబరుస్తుంటాడు. ఖరీదైన వాచ్ లు, టీషర్టులు, కార్ల విషయంలోను ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. ఇక అల్లు అర్జున్ క్యారవాన్ చూస్తే ఆయన అభిరుచి ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్యారవాన్ పిక్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ క్యారవాన్ బ్లాక్ కలర్లో చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. ఈ క్యారవాన్ పై A A అనే అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ క్యారవాన్ ఖరీదు అక్షరాలా 7 కోట్ల రూపాయలట. అంతేకాదు ఇంటీరియర్ కోసమే 3.5 కోట్ల ఖర్చు చేశారని సమాచారం. విలాసవంతమైన సకల సౌకర్యాలు ఈ క్యారవాన్లో ఉన్నాయని అంటున్నారు. ఇంతటి లగ్జరీ క్యారవాన్ దేశంలో మరే హీరోకి లేదని చెప్పుకుంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com