ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్లల్లో కలవరమై .. కలవరమై పాట విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2019, 11:34 AM



సినీనటి జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ''దొరసాని'' సినిమా టీజర్ ఇటీవల విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాట ప్రస్తుతం శ్రోతల మనస్సును దోచుకుంటుంది. "కళ్లల్లో కలవరమై .. కలవరమై, గుండెల్లో పరవశమో వరమై.." అంటూ ఈ పాట సాగుతోంది. మెలోడీగా సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.  


ఇకపోతే.. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో 'దొరసాని' అనే ప్రేమకథ రూపొందుతోంది. శివాత్మిక .. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నాయికా నాయకులుగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ టైటిల్‌కే కాదు.. టీజర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా వచ్చేసిన కళ్లల్లో కలవరమై పాట.. సూపర్ హిట్ అయ్యింది. విడుదలైన గంటల్లోనే శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇకపోతే.. ఈ పాటకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం, శ్రేష్ట సాహిత్యం, చిన్మయి శ్రీపాద ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకేముంది... తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com