ఆయన కాలర్ పట్టుకున్నాను!హీరో జేడి

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 25, 2019, 08:05 PM

ప్ర‌ముఖ ఛానల్ ఈ టీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా ప్రోగ్రాం గురించి మనకు తెలిసిందే . ఈ షోకి నిన్న ప్రముఖ హీరో జేడి చక్రవర్తి పాల్గొన్నారు .. అయితే ఈ షోలో అయన ఆసక్తికరమైన సన్నివేశాలను వెల్లడించారు .. అయితే ఇందులో భాగంగా తన మొదటి సినిమా అయిన శివ అనే సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని వివరించారు .. శివ సినిమా షూటింగ్ లో భాగంగా ఓ ఫైట్ సీన్ ని పటాన్ చేరు లో చిత్రీకరిస్తున్నారు .. అయితే అక్కడ జనం బాగా ఉండడంతో షూటింగ్ చేయలని పరిస్థితి ఏర్పడింది . దీనితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరికీ తెలియకుండా షూటింగ్ పూర్తి చేయలని అది కూడా చాలా నిజంగా ఉండాలని అనడంతో ఇద్దరం గొడవపడ్డామని అయన తెలిపారు .. దీనిలో భాగంగా ఆయన నన్ను కొట్టారని నేను లేచి ఆయన కాలర్ పట్టుకున్నానని ఆయన వెల్లడించారు .. దీనితో అన్నపూర్ణ స్టూడియో కి సంబంధించిన డ్రైవర్ లు రాడ్లు పట్టుకొని వచ్చారని కానీ నాగార్జున మాత్రం నన్ను పట్టుకొని వారిని వెనుకకి పంపించారని చెప్పుకొచ్చారు జేడి ... 


 
Recent Post