సంప్ర‌దాయాల‌ను కాపాడే సెక్ష‌న్ 497

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 11:27 AM

మనదేశంలో ‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని గురించి పూర్తిగా తెలియాలంటే ప్రభుత్వం కూడా కలిసిరావాలి. దీన్ని ప్రధానం చేసుకుని ఈ చిత్రం రూపొందుతోంది. సూపర్‌స్టార్‌ కృష్ణతో శ్రీశ్రీ చిత్రాన్ని నిర్మించిన సాయిదీప్‌ దాట్ల జి.జాన్‌, సందీప్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ గుంటూరు జిల్లా గోరంట్లలో మొదలైంది. సందీప్‌ జక్కం దర్శకత్వం వహిస్తున్నారు. అంగనారాయ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. చిత్ర కథాంశం గురించి చెప్పాలంటే మనదేశంలో వివాహ వ్యవస్థ బలీయమైంది. ఇరువురు వ్యక్తులను, రెండు కుటుంబాలను కలిపి ఒక్కటిగా చేస్తూ బలోపేతం చేస్తుంది. కానీ ఇటీవలే పాశ్యాత్య ధోరణులు పెరిగి, కుటుంబ వ్యవస్థ పాడవుతోంది. మన సంప్రదాయాలు మరుగున పడకుండా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఏర్పడింది. దీనిని ప్రభుత్వంలోని చాలా మంది సమర్థిస్తున్నారు. దీనిపై సినమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు.ఈ చిత్రంలో ఇంకా కేతన్‌ సాయి, జియో దర్లా, మణికాంత్‌ నటిస్తున్నారు. జూలై మొదటివారంలో షూటింగ్‌ మొదలవుతుంది.
Recent Post