ఒకే ఫ్రెమ్ లో విజయ్ దేవరకొండ,రష్మిక

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 12:02 PM

రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉంది. సక్సస్ లతో దూసుకుపోతుంది, ఒక్క టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోను ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ ఒకేఒక్క సినిమా తన ఫెట్ మార్చేసింది, అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. తరువాత గీతగోవిందం సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు, 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయాడు. విజయ్ దేవరకొండ సినిమా అంటే చాలు అభిమానులు లిప్ కిస్ ని ఖచ్చితంగా కోరుకుంటున్నారు , ఇప్పటివరకు విజయ్ చేసిన అన్ని సినిమాల్లో లిప్ లాక్స్ కనిపించాయి. దాంతో విజయ్ దేవరకొండని బాలీవుడ్ ఇమ్రాన్ హస్మి తమ్ముడుగా బిరుదుని ప్రకటించారు. ఇది ఇలా ఉంటె ఎప్పటినుండో విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మధ్య కెమిస్ట్రీ పైన చాల కామెంట్స్ వచ్చాయి, వారిద్దరి రొమాన్స్ ఒక్క ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ పైన కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందనే రూమర్ కూడా ఉంది. వీరిద్దరి పెయిర్ అంటే ఇండస్ట్రీ లో చాలామందికి ఇష్టం. గీతగోవిందం సినిమాతో వీరిద్దరూ బాగా పాపులర్ అయిపోయారు, ఆ సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది దాంతోనే రక్షిత్ శెట్టి తో కూడా పెళ్ళి క్యానిల్ అయ్యిందనే వార్త కూడా హల్చల్ చేసింది.


 


ఆ విషయం పైన ఇప్పటికి క్లారిటీ రాలేదు, గీతగోవిందం తరువాత రష్మిక విజయ్ కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు ఈ సినిమాలో కూడా లిప్ కిస్ పెట్టేసుకున్నారు. అంతేకాకుండా బయట ప్రపంచంలో కూడా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ కెమెరా కంటికి చాలాసార్లు కనిపించారు. తాజాగా మరోసారి విజయ్ అలాగే రష్మిక ఇద్దరు కూడా ఒకే ఫ్రెమ్ లో ఎంజాయ్ చేస్తూ అభిమానులకు కనిపించారు. దాంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే నమ్మకం మరింత ఆద్యం పోసుకుంది. తాజాగా జూబ్లీ హిల్స్ లో విజయ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఓక హోటల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ బయటకి వచ్చాయి అందులో రష్మిక కూడా ఉండడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రష్మిక కళ్ళజోడు పెట్టుకొని కనిపించడమే ఇక్కడ స్పెషల్ ఎందుకంటే రష్మిక ఏదైనా ఫంక్షన్ కి కానీ లేదా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కానీ కళ్ళజోడు ధరిస్తుంది. ఇక ఇప్పుడు పార్టీకి కూడా కళ్ళజోడు పెట్టుకొని రావడం వీరిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదని అర్ధమౌతుంది. ఫ్రెండ్ షిప్ కంటే రెండాకులు ఎక్కువే ఉందని అంటున్నారట. అది మరి సంగతి.


 


 
Recent Post