స్విమ్మింగ్ పూల్ లో పూజాహెగ్డే హాట్ షో

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 01:13 PM

బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి పనిచేస్తోంది.వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో తీసుకున్న ఓ ఫోటోని షేర్ చేసింది.పసుపు రంగు బికినీ వేసుకొని వెనుక నుండి ఫోజిచ్చింది. ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు హాట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు తారలు కేవలం వెండితెరపై హాట్ షో చేస్తే పూజా మాత్రం అటు వెండితెరపై ఇటు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ భంగిమలతో రెచ్చిపోతోంది


 


 




Recent Post