ఈ గాసిప్‌లు ఎన్నాళ్లు వినాలో

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 06:50 PM

టాలీవుడ్ రాజుల హీరో గా పిలవబడే అమరేంద్ర బాహుబలి ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే, ముఖ్యంగా అమ్మాయిల్లో తనకున్న ఫాలోయింగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఇటీవల  ప్ర‌భాస్‌ని కలవడానికి జపాన్ నుండి ప్రత్యేకంగా 15 మంది అమ్మాయిలు వచ్చారంటే మాములు విషయం కాదు.    ఆ మ‌ధ్య  ప్రభాస్ అనుష్క మధ్య ప్రేమ చిగురించింది పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చిన విష‌యాన్ని వీళ్లు ప్ర‌శ్నించార‌ట‌. దానికి చిరున‌వ్వే స‌మాధానంగా చెప్పాడ‌ట ప్ర‌భాస్‌.   ఇప్ప‌టికే ప్రభాస్కు 39 సంవత్సరాలు,  అనుష్కకు 37 సంవత్సరాలు వ‌చ్చేసాయి. పెళ్లి వయసు దాటి పోతున్నా అటువైపు దృష్టి పెట్ట‌క పోవ‌టం, సినిమాలే జీవితంగా బ‌తికేస్తుంటంతో చాలా రోజుల నుండి అనుష్క ప్రభాస్ మధ్య ఏదో ఉందని ఎంతమంది ఎన్నిరకాలుగా రాసినా వీళ్లిద్దరు మాత్రం ఆ వార్తలకు స్పందించే విషయంలో ఒకేలా  స‌మాధానం ఇవ్వ‌టంపైనా  ర‌చ్చ జ‌రుగుతోంది. మ‌రి వీరి మీద గాసిప్‌లు ఎన్నాళ్లు వినాలో అంటూ నెటిజ‌న్ల కామెంట్లూ మెద‌ల‌య్యాయి.


 


 


 


 


 


 
Recent Post