ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో సినిమా షురూ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2019, 10:24 PM



దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు-హీరో బన్నీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పనులను చిత్రయూనిట్ చకాచకా పూర్తి చేస్తున్నారు. తాజాగా డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాసరావు,  నిర్మాత రాధాకృష్ణ ఆధ్వర్యంలో సినిమాలోని డైలాగులకు బన్నీ డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  కాగా  అల్లు అర్జున్.. ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com