ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయ్ కిరణ్ పై సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలా ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2019, 10:50 PM



చిత్రం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఉదయ్ కిరణ్ అ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మళ్ళీ వెనుదిరిగి చూసుకుంది లేదు .. వరుస సినిమాలు వరుస సక్సెస్ లు అయన వెంట వచ్చాయి .. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు . లైఫ్ అంతా బాగానే ఉంది అనుకున్నా టైంలో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు . దీనితో ఒక్కసారిగా సినీలోకం దిగ్బ్రాంతికి లోనైంది .. అసలు ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు అన్నది ఇప్పటికి ఓ ప్రశ్నలాగే మిగిలిపోయింది .. కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ పై డైరెక్టర్ తేజ బయోపిక్ తీస్తున్నారనే వార్త ఒకటి బయటకు వచ్చింది . కానీ అది కార్యరూపం దాల్చలేదు ..అయితే తాజాగా దీనిపైన తేజ స్పందించారు . తేజ మాట్లాడుతూ " ఉదయ్ కిరణ్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు .. కానీ అతని మీదా బయోపిక్ తీసి ఏం లాభం .. ఇప్పుడు ఆయనపై సినిమా తీసి నేను డబ్బులు సంపాదించుకోవాలా ? అనే ఆలోచన వచ్చింది . అందుకే ఆ సినిమాని తీయలేదని తేజ చెప్పుకొచ్చారు . ఉదయ్ కిరణ్ పై సినిమా తీస్తే ఇప్పుడు వచ్చే యంగ్ హీరోలకు అది ఓక పాఠం అవుతుంది . సినిమా చూసే వాళ్ళకి పాఠం చెప్పకూడదు . వినోదం మాత్రం ఇవ్వాలని తేజ చెప్పుకొచ్చారు ..


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com