ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో పెళ్లి చేసుకున్న‌అమలాపాల్ మాజీ భర్త

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2019, 08:10 PM



త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్, అమలాపాల్ మాజీ భర్తకు చెన్నైలో వివాహం అయ్యింది. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే డాక్టర్ ని ఆయన రెండవ పెళ్ళి చేసుకున్నారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వేడుక‌కి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.  విజయ్ 2014లో హీరోయిన్ అమలాపాల్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరికి వారు బతికేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ - అమలాపాల్ కొద్దికాలానికే వేరుపడ్డారు. ఆ తర్వాత అమలాపాల్ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు విజయ్ మళ్లీ పెళ్లి చేసుకుని  ఓ ఇంటివాడు అయ్యాడు.  ప్రస్తుతం విజయ్...దేవి 2 సినిమాతో పాటు జ‌య‌ల‌లిత బయోపిక్ చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుల కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా న‌టిస్తుంది. హిందీలో ‘జయ’ టైటిల్‌తో, తమిళంలో ‘తలైవి’ టైటిల్‌ తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com