’ఓ బేబీ’తో అక్కినేని వారిటి కోడలు సమంత మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లలతో దూసుకుపోతోంది. సమంత కెరియర్లో సోలోగా అత్యధిక థియేటర్స్లో విడుదలైన ఈ మూవీ ఆమె కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసిన సమంత సరికొత్త ప్రయోగానికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో వారంలోకి వచ్చినా కొత్త సినిమాలు విడుదలైనా కలెక్షన్ల పరంగా తగ్గుదల లేకపోవటంతో బయ్యర్లు తెగ ఆనందంగా ఉన్నట్టు ఫిలింనగర్లో వినిపిస్తున్న మాట.