'ఓ బేబీ' సక్సెస్‌తో మాంచి జోష్ మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తక్కువ రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టి.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు, ఫుల్ రన్‌లోనూ భారీ సీట్ ఆక్యూపెన్సీని దక్కించుకుంటోంది ఈ సినిమా. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతోంది సామ్ బేబీ. ఇందులో భాగంగానే ఆమె తాజాగా ఓ క్రేజీ ఆఫర్‌ను పట్టేసిందని ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో సత్తా చాటుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని సమంత.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతుందట. దీనిని ప్రముఖ డిజిటల్ మీడియా దిగ్గజం అమేజాన్ ప్రైమ్ తెరకెక్కించబోతుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సదరు సంస్థ సమంతకు భారీ ఆఫర్ ఇచ్చిందని కూడా తెలుస్తోంది.
దీనికితోడు, అది హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరిగే స్టోరీ కావడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనడం లేదు. కాబట్టి వీలైనంత త్వరగా వెబ్ సిరీస్ ప్రారంభించాలని అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో చెప్పేసిందట. ఈ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇప్పటికే దీనిపై స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని తెలిసింది. ఇది సందేశాత్మకంగా ఉంటూనే.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందట. ఈ కారణంగానే సమంత ఒప్పుకుందన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే, ఇటీవల సమంత తన అభిమానులతో ఇంటారాక్ట్ అయిన సందర్భంలో ఓ వ్యక్తి మీరు నెట్‌ఫ్లిక్స్ తరహా వెబ్ సిరీస్‌లు చేయొచ్చు కదా అని ప్రశ్నించాడు. దీనికి సామ్ ఏమీ సమాధానం చెప్పలేదు. సో.. ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోబట్టే ఆమె ఏమీ మాట్లాడలేకపోయిందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో సమంత నిజంగానే వెబ్ సిరీస్‌లో నటిస్తుందని ఆమె అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.