బిగ్ బాస్ . మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈ షో గురించి వ్యతిరేక వార్తలు మాత్రం గత బిగ్ బాస్‌లకి భిన్నంగా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 14 మంది కంటెస్టెంట్స్‌తో 100 ఎపిసోడ్లు ప్రసారం కానున్న ఈ బిగ్ బాస్-3 షోని నిషేధించాలని డిమాండ్ చేస్తోంది. ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి . అయితే ఈ షో నిర్వాహకులపై నిప్పులు చెరుగుతూ మీడియాలో కనిపించిన ఈమె, తాజాగా షో పేరిట అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని శనివారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. బిగ్ బాస్ పేరుతో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని, బిగ్ బాస్ షోలో జరిగే విషయాలు చెప్పేందుకే తాను ధైర్యంగా ముందుకొచ్చానన్నారు.
బిగ్‌బాస్‌కు ఎంపికయ్యారంటూ ఏప్రిల్‌లో ఒకరు ఫోన్ చేశారని, కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ ఇవ్వకుండా తనను వేధింపులకు గురిచేశారని బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేయాలంటూ తనకు ఫోన్ చేసి చెప్పినట్లు శ్వేతారెడ్డి ఫిర్యాదులో పేర్కొంది.