ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్ర‌పంచ‌క‌ప్పా? హ‌నీమూన్ ట్రిప్పా? : రాఖీ సావంత్‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2019, 11:12 AM



బాలీవుడ్ ఐట‌మ్ గ‌ర్ల్ రాఖీ సావంత్‌.. చాన్నాళ్ల త‌రువాత తెరమీదికి వ‌చ్చారు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ సెమీఫైన‌ల్‌లో దారుణంగా ఓడిపోవ‌డంపై ఆమె ఘాటుగా స్పందించారు. కఠిన ప‌దజాలంతో క్రికెట‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఓట‌మిపాలు కావ‌డానికి కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కేప్టెన్ రోహిత్‌శ‌ర్మే కార‌ణ‌మ‌ని నిప్పులు చెరిగారు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌కు త‌మ భార్య‌ల‌ను తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని నిల‌దీశారు. వారిద్ద‌రూ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ను హ‌నీమూన్ ట్రిప్‌గా మార్చారంటూ విమ‌ర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి సెమీఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు 18 ప‌రుగుల తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఇద్ద‌రూ దారుణంగా విఫ‌లం అయ్యారు. భారీ స్కోరును సాధిస్తార‌ని ఆశించిన వారిద్ద‌రూ ఒక ప‌రుగు వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట్ అయ్యారు. ఫ‌లితంగా- మ్యాచ్ చేజారిపోయింది. న్యూజిలాండ‌ర్లు సాధించ‌ద‌గ్గ స్కోరే భార‌త్ ముందు ఉంచిన‌ప్ప‌టికీ.. ఓపెన‌ర్లు మొద‌లుకుని లోయ‌ర్ ఆర్డ‌ర్ వ‌ర‌కూ బ్యాట్స్‌మెన్లంద‌రూ విఫ‌లం అయ్యారు. వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ, ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఆదుకోక‌పోయి ఉంటే ప‌రాజ‌యం మ‌రింత అవ‌మాన‌క‌రంగా ఉండేది.


ఈ వ్య‌వ‌హారం మొత్తం రాఖీ సావంత్‌ను తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసిన‌ట్టుంది. అందుకే- ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ ప‌రాజ‌యానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను బాధ్యుల‌ను చేశారు. చెడామ‌డా తిట్టేశారు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ను హ‌నీమూన్ ట్రిప్‌గా మార్చుకున్నార‌ని ఆరోపించారు. విరాట్ కోహ్లీ భార్య అనూష్క శ‌ర్మ‌, రోహిత్ శ‌ర్మ భార్య రితికాల‌కు ఇంగ్లండ్‌లో ఏం ప‌ని అంటూ ప్ర‌శ్నించారు. అనూష్క శ‌ర్మ‌, రితిక ఇద్ద‌రూ ప్రధాన కారకులని, టీమిండియా ఓటమికి వారిద్దరూ బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. టోర్న‌మెంట్‌లో చ‌క్క‌గా ఆడుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఇద్ద‌రూ సెమీఫైన‌ల్‌లో విఫ‌లం కావ‌డానికి వారి భార్య‌లే కార‌ణ‌మంటూ ఆమె ఘాటుగా స్పందించారు. దీనిపై ట్వీట్ట‌రెట్టీలు కూడా అంతే ఘాటుగా ఆమెకు బ‌దులిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com