ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 9న 'మన్మథుడు 2'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 12:25 PM



నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందింది. రకుల్ ప్రీత్ - కీర్తి సురేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


నాగార్జున సొంత బ్యానర్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రను పోషించింది. వెన్నెల కిషోర్ .. ఐశ్వర్య గౌడ ముఖ్యమైన పాత్రల్లో  కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. 'మన్మథుడు' స్థాయిలో 'మన్మథుడు 2' కూడా నాగార్జునకి హిట్ తెచ్చిపెడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com