బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ ఈ రోజు (జులై 16, 2019) 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ వసంతంలోకి అడుగు పెట్టింది. పుట్టిన రోజు సందర్భంగా కత్రీనాకు అభిమానులు, సెలబ్రిటీలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్ డే సెలబ్రేషన్స్ ను కుటుంబ సభ్యులతో కలిసి కత్రీనా మెక్సికో వెళ్లింది. ఈ స్పెషల్ డే సందర్భంగా బీచ్ లో బికినీ వేసుకుని ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు క్రతినా సూపర్...కత్రీనా గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినా ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినామాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల సల్మాన్ తో కలిసి కత్రినా నటించిన "భారత్" సినిమా భాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ కత్రీనా బాలీవుడ్ తోనే సరిపెట్టుకుంటోంది.తెలుగులో కూడా కత్రీనా రెండు సినిమాలు చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరీ, నందమూరి అందగాడు బాలకృష్ణ నటించిన అల్లరిపిడుగు సినిమాల్లో హీరోయిన్ గా కత్రీనా నటించింది. అయితే ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ వైపు చూడలేదు.