జీవిత రాజశేఖర్ల కూతురు శివాత్మిక, దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘దొరసాని’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్తో రన్ అవుతోంది. ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడంతో పాటు ట్రోలింగ్ చేయడంపై జీవిత రివ్యూవర్స్కి చురకలు అంటించారు. నిన్న కొంత మొనది సెలబ్రిటీలను పిలిచి షో వేశారు.
ఈ షో పూర్తి అయ్యాక జీవిత మాట్లాడుతూ ఒకరిగురించి తప్పుగా రాయడం మాట్లాడటం ద్వారా ఆ వచ్చిన డబ్బులు నా వరకూ శవాలపై డబ్బులు ఏరుకున్నట్టేనని దయచేసి అలా చేయొద్దని కోరారు. రివ్యూలు కూడా దారుణంగా రాస్తున్నారని ఇది వరకూ సినిమా విడుదలైన వారం తరువాత రివ్యూలు వచ్చేవని అన్నారు. ఇప్పుడు సినిమా చూస్తూనే సినిమా ఏంటో ఎలా ఉందో తెలియకుండానే మూవీ స్టార్ట్ కాగానే పదిన్నరకు సినిమా స్టార్ట్ అయ్యింది. 11కి హీరో ఇలా అన్నాడు.. 12 హీరోయిన్ ఇలా అంటుంది అంటూ నోటికొచ్చినట్టు రివ్యూలు రాసేస్తున్నారు.
ఇన్నికోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మీకు తోచినట్టు రాసేస్తే.. కోట్లు పెట్టి తీసిన నిర్మాతలు ఏమైపోవాలని ప్రశ్నించారు. ఇలాంటి రివ్యూల వల్ల ఎబౌన్ యావరేజ్ మూవీలు చచ్చిపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి రివ్యూల వల్ల నచ్చే వాళ్లు కూడా సినిమా చూడలేకపోతున్నారని ఆమె చెప్పుకొచ్చింది.